News December 11, 2025

ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

image

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.

Similar News

News March 29, 2026

లోక్ అదాలత్‌లో 5,399 కేసులు పరిష్కారం: ADB SP

image

ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. మొత్తం 5,399 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందులో 3,812 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,017 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయి. సైబర్ బాధితులకు రూ.9.95 లక్షలు వాపసు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

News March 29, 2026

ADB: ఏప్రిల్ 1 నుంచి పదో తరగతి పత్రాల మూల్యాంకనం

image

జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 – 9 వరకు నిర్వహించనున్నట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకోసం 614 మంది ఉపాధ్యాయులను కేటాయించినట్లు పేర్కొన్నారు. వీరిలో 466 మంది చీఫ్ ఎగ్జామినర్లు (CE), అసిస్టెంట్ ఎగ్జామినర్లు (AE) ఉండగా, 148 మందిని స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించినట్లు వెల్లడించారు.

News March 29, 2026

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ప్రకటన

image

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదిలాబాద్ విమానాశ్రయంపై కీలక ప్రకటన చేశారు. ఉడాన్ 2.0 పథకం కింద ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయం నిర్మించనున్నట్లు తెలిపారు. ​ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను కాకుండా, మిగిలిన భూమిని సేకరించి అక్కడ విమానాశ్రయం నిర్మిస్తామని స్పష్టం చేశారు.