News December 11, 2025
ఉప్పల్‌పల్లి సర్పంచ్‌గా ర్యాకం శ్రీనివాస్

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లి సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి ర్యాకం సంపత్‌పై 90 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీనివాస్ గెలుపుతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు.
Similar News
News April 7, 2026
మాతా-శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

జనగామ మాతా, శిశు ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, ఓపీ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం కాకుండా చూడాలని ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న కలెక్టర్.. వారికి నాణ్యమైన మందులు, పోషకాహారం అందించాలని వైద్యులను కోరారు.
News April 7, 2026
ఏలూరు: అనాథ చిన్నారులకు.. నూతన జీవితం

అనాథలైన ముగ్గురు పిల్లలకు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి నూతన జీవితాన్ని అందించారు. కుక్కునూరుకు చెందిన ముగ్గురు పిల్లల తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి వారిని వదిలేసి వెళ్లడంతో చిన్నారులు అనాథలయ్యారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న కలెక్టర్ బాల సంరక్షణ అధికారుల ద్వారా సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం ఆమె ఆ చిన్నారులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.
News April 7, 2026
అమలాపురం: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

అమలాపురం మండలం బండారులంకలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరగిరిపట్నంకు చెందిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురం డిపోకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనంపై అంబాజీపేట వైపు వెళ్తున్న యువకుడిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


