News April 20, 2024
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

నల్గొండ-నకిరేకల్ రహదారిలో తిప్పర్తి మండలం పెద్ద సూరారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సుందర్ రావు సమీప బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం నల్గొండకు వస్తుండగా పెద్ద సూరారం వద్ద అడవి పందులు రోడ్డుకు అడ్డుగా రావడంతో వాటిని తప్పించబోయి చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో సుందర్ రావు అక్కడికక్కడే మరణించారు.
Similar News
News March 11, 2026
నల్గొండ: మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల ఊసేదీ?

జిల్లాలో కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడి రోజులు గడుస్తున్నా, ఇంతవరకు సమావేశాల ఊసే లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు.
News March 11, 2026
నల్గొండ: అప్పు విషయంలో గొడవ ప్రాణం తీసింది

అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News March 10, 2026
నల్గొండ: పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్

జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూసేకరణలో జాప్యం లేకుండా చూడాలని, ప్రాజెక్టులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ అమిత్, ఆర్డీవోలు పాల్గొన్నారు.


