News December 11, 2025
విశాఖ కోస్టల్ సెక్యూరిటీ సిబ్బందికి ‘ఈ-ఆఫీస్’ శిక్షణ

విశాఖ కోస్టల్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ఎస్పీ జీబీఆర్.మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్‌ఐసీ బృందం పోలీసు సిబ్బందికి ఈ-ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల వినియోగంపై సమగ్ర శిక్షణ ఇచ్చింది. పరిపాలనలో పారదర్శకత, కాగిత రహిత సేవల కోసమే ఈ శిక్షణని అదనపు ఎస్పీ తెలిపారు.
Similar News
News December 16, 2025
స్టీల్ ప్లాంట్ హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు

విశాఖ స్టీల్ ప్లాంటు హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. 3బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా రోజుకు19వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉండగా..24 గంటల్లో 21,012 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరిగింది. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు బ్లాస్ట్ ఫర్నేస్–1 నుంచి 7,058 టన్నులు, ఫర్నేస్–2 నుంచి 6,558 టన్నులు, ఫర్నేస్–3 నుంచి 7,396 టన్నులు ఉత్పత్తిచేసి గత రికార్డును అధిగమించారు.
News December 15, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

విశాఖలో సోమవారం రెండు కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 171 మంది అభ్యర్థులకు గానూ 161 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 10 మంది గైర్హాజరు అయ్యారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక పరీక్ష కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.
News December 15, 2025
విశాఖలో పీజీఆర్ఎస్‌కు 299 వినతులు: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 299 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 132 ఉండగా, జీవీఎంసీ 76, పోలీస్ విభాగానికి సంబంధించినవి 24, ఇతర విభాగాలకు చెందినవి 67 ఉన్నాయి.


