News December 11, 2025
MDK: ఆ ఊరిలో ఒక్క ఓటు తేడాతో గెలుపు

రేగోడ్ మండలంలో కొండాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బేగరి పండరి విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి హరిజన సత్తయ్య మీద ఒక ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
Similar News
News January 12, 2026
జిల్లా పోలీస్ కార్యాలయానికి 74 అర్జీలు

కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను(PGRS) జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ రావు నిర్వహించారు. బాధితుల నుంచి 74 పిర్యాదులను ఆయన స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి
వాటిని పరిశీలించాలని ఆయన ఆదేశించారు. త్వరితగతిన అర్జీలను పరిష్కారం చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.
News January 12, 2026
తొక్కిసలాట బాధ్యత టీవీకేది కాదన్న విజయ్!

కరూర్ <<17852847>>తొక్కిసలాట<<>>కు టీవీకేది బాధ్యత కాదని ఆ పార్టీ అధినేత విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో CBI <<18836427>>ఆయన్ను<<>> 6 గంటలు విచారించింది. విషాదం తీవ్రత పెరగకుండా తాను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారని సమాచారం. ‘విజయ్‌ను ప్రశ్నించడం ముగియలేదు. పండుగ నేపథ్యంలో వాయిదా వేయాలని ఆయన కోరారు. పొంగల్ తర్వాత ఆయన్ను మరోసారి పిలుస్తాం’ అని CBI వర్గాలు తెలిపాయి.
News January 12, 2026
పెద్దపల్లి: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన కావ్య (24) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్ల క్రితం పెద్దపల్లి మండలం రాఘవపూర్‌కు చెందిన శ్రావణ్‌తో ఆమెకు వివాహం జరిగింది. అదనపు వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధించడం వల్లే తమ కూతురు తనువు చాలించిందని తండ్రి రాజమల్లు ఆరోపిస్తున్నారు. కావ్య మరణంతో మొట్లపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదైంది.


