News December 11, 2025

​పంచాయతీ రాజ్ వ్యవస్థలదే కీలక పాత్ర: జీవీఎంసీ కమిషనర్

image

దేశ జనాభాలో 70 శాతం మందికి సేవలందిస్తున్న పంచాయతీ రాజ్ వ్యవస్థల పాత్ర కీలకమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఐఐఎం విశాఖలో పంచాయతీ రాజ్ అధికారుల కోసం నిర్వహించిన నాయకత్వ శిక్షణ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. అధికారుల నైపుణ్యాలను పెంచేలా ఐఐఎం రూపొందించిన శిక్షణా విధానాన్ని ప్రశంసించారు. 2026 మార్చి నాటికి 500 మంది అధికారులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Similar News

News December 15, 2025

విశాఖ: టెట్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

image

విశాఖలో సోమవారం రెండు కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 171 మంది అభ్యర్థులకు గానూ 161 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 10 మంది గైర్హాజరు అయ్యారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక పరీక్ష కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.

News December 15, 2025

విశాఖలో పీజీఆర్ఎస్‌కు 299 వినతులు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 299 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 132 ఉండ‌గా, జీవీఎంసీ 76, పోలీస్ విభాగానికి సంబంధించిన‌వి 24, ఇత‌ర విభాగాల‌కు చెందిన‌వి 67 ఉన్నాయి.

News December 15, 2025

విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

image

విశాఖలో డిసెంబర్ 21న పల్స్ పోలియో నిర్వహించనున్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఇప్పటికే సూచించారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ విషయన్ని గమనించాలని అధికారులు కోరారు.