News December 11, 2025

ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

image

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.

Similar News

News March 24, 2026

నిధులను డ్రా చేసుకునేలా పూర్తి స్వేచ్ఛనివ్వాలి: ADB కలెక్టర్

image

రైతు భరోసా నిధులను రైతులు డ్రా చేసుకునేలా పూర్తి స్వేచ్ఛనివ్వాలని కలెక్టర్ రాజర్షిషా బ్యాంక్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల పంపిణీలో బ్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

News March 24, 2026

సీసీటీవీ విస్తరణతో నేరాల నియంత్రణ సాధ్యం: ఆదిలాబాద్ ఎస్పీ

image

జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఎస్పీ అఖిల్ మహాజన్ కీలక సూచనలు చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలు, గ్యాంబ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. సీసీటీవీల ఏర్పాటును ఉద్యమంలా చేపట్టాలని, రోడ్డు భద్రతపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆన్‌సైట్ ఎఫ్ఐఆర్‌ల నమోదు పెంచి, ప్రతి కేసును క్షుణ్ణంగా సమీక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.

News March 24, 2026

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి: కలెక్టర్

image

మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం భీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని వంట గది, సరుకు నిల్వల గది, భోజన శాల, వసతి గృహాలను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఎప్పటికపుడు రిజిస్ట్రార్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. తహశీల్దార్ రమేశ్ తదితరులున్నారు.