News December 11, 2025

రాజాపూర్: మెజార్టీ పెంచిన రీ కౌంటింగ్

image

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో బీజేపీ గెలుపొందింది. మొదట కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంజలిపై 6ఓట్లతో బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటేపాగ రేవతి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రీ కౌంటింగ్ కోరడంతో నిర్వహించిన రీకౌంటింగ్‌లో రేవతికి 36ఓట్ల మెజార్టీ లభించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో విషయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.

Similar News

News April 4, 2026

జడ్చర్ల: అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి

image

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు రామకృష్ణ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నిరుపేద అయిన బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

News April 4, 2026

నవాబుపేట: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

image

కాకర్లపహాడ్ వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి, పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తిని గుర్తించిన వారు ఎవరైనా ఉంటే నవాబుపేట ఎస్సై విక్రమ్‌కు ఫోన్ ద్వారా 8712659340 సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బంధువులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఉంటే త్వరగా స్పందించాలని అధికారులు కోరుతున్నారు.

News April 3, 2026

గవర్నర్‌ను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ

image

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ఖేల్ సంసద్’ క్రీడా మహోత్సవం గురించి గవర్నర్‌కు వివరించారు. ఈ క్రీడల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రం అందజేశారు. ముగింపు ఉత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు ఎంపీ అరుణ వెల్లడించారు.