News December 11, 2025
PDPL: AICC జాతీయ అధ్యక్షుడిని కలిసిన ప్రముఖులు

AICCజాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, CM రేవంత్ రెడ్డిని మంత్రి వివేక్, పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ గురువారం HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఆయన సూచించారు. తెలంగాణను దేశంలో ఒక మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దాలని ఖర్గే మార్గదర్శకం చేశారు.
Similar News
News January 8, 2026
పర్లపల్లి: ‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి’

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలను గురువారం ఆమె సందర్శించి, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీని అందజేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేక సిలబస్‌తో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 33 ప్రీప్రైమరీ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు.
News January 8, 2026
పార్వతీపురం: మన్యం కళావేదికగా నృత్య పోటీలు

మన్యం కళావేదికగా శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి నృత్య పోటీలు జరుగుతాయని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరై పోటీలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మండల స్థాయి పోటీలు బుధవారంతో ముగిశాయని, శుక్రవారం జిల్లా స్థాయి పోటీలు జరగనున్నట్లు చెప్పారు.
News January 8, 2026
సిరిసిల్ల: ‘ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి’

ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యూరియా పంపిణీ ఇతర అంశాల పరిశ్రమలకు జిల్లా, మండల టాస్క్ఫోర్స్ టీంను గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల కొరతలేదని, పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు.


