News December 11, 2025
చలి పంజా.. బయటికి రావద్దు!

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. TGలో ఇవాళ రాత్రికి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోతాయని TG వెదర్‌మ్యాన్ తెలిపారు. HYD సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుందన్నారు. ఉమ్మడి ADB, NZB, WGL, MDK జిల్లాలకు IMD రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆంధ్రాలో ఈ వారమంతా చలిగాలులు కొనసాగుతాయని AP వెదర్‌మ్యాన్ తెలిపారు. అరకు, వంజంగి, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలకు పడిపోయాయి.
Similar News
News March 10, 2026
USకు జెలెన్‌స్కీ సాయం.. కాలం కలిసి రావడం అంటే ఇదే!

‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి’ అన్నట్లు జియోపాలిటిక్స్ మారిపోయాయి. ఏడాది క్రితం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీని ఎగతాళి చేసిన ట్రంప్ ఇప్పుడు అదే ఉక్రెయిన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇరాన్ డ్రోన్లతో అమెరికా రక్షణ వ్యవస్థలు దెబ్బతింటుంటే వాటిని కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ నైపుణ్యం ఇప్పుడు USకు అవసరమైంది. మిస్సైళ్ల కోసం అర్థించిన జెలెన్‌స్కీ నేడు అమెరికాకు రక్షణ వ్యవస్థ అందించే స్థాయికి చేరారు.
News March 10, 2026
UAEలో రియల్ ఎస్టేట్ ఢమాల్.. గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిన ధర

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో దుబాయ్, అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోతోంది. అబుదాబిలోని అల్-జుబైల్‌లోని ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర ఒక గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. కాగా ఇరాన్ ఇప్పటివరకు యూఏఈపై వెయ్యికి పైగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో బిలియనీర్లు సేఫ్టీ కోసం దుబాయ్ వదిలి సింగపూర్‌కు షిఫ్ట్ అయి అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
News March 10, 2026
క్షమాపణ కోరిన NCERT

8వ తరగతి పుస్తకంలో <<19253509>>‘న్యాయ వ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై వివాదం చెలరేగడంతో NCERT బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పింది. ఇప్పటికే ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ పుస్తకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా ఆ పాఠ్యాంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


