News December 11, 2025
గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్

TG: SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 5, 6, 9వ తరగతుల్లో చేరికలకు 2026 FEB 22న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో JAN 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. ప్రాస్పెక్టస్ వివరాలకు ‘https://tgcet.cgg.gov.in’ సందర్శించవచ్చని సూచించింది.
Similar News
News March 20, 2026
జొమాటో కస్టమర్లకు షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును ఆర్డర్‌పై రూ.2.40 చొప్పున పెంచింది. దీంతో రూ.12.50 నుంచి రూ.14.90కి పెరిగింది. పోటీ కంపెనీ స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్‌పై రూ.14.99 చొప్పున వసూలు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిన కారణంగానే ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు తెలుస్తోంది. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్లతోపాటు రెస్టారెంట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
News March 20, 2026
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లు షురూ

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు <
Share It
News March 20, 2026
2014 నుంచి 6వేల ఫోన్లు ట్యాప్: రేవంత్

TG: BRS ప్రభుత్వ హయాంలో 6వేల ఫోన్లను ట్యాప్ చేయించారని CM రేవంత్ వెల్లడించారు. ‘ట్యాపింగ్ కేసులో చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. విచారణ పూర్తికాకుండా అరెస్టులు చేయలేం. పంజాగుట్ట PSలోని కేసులో హరీశ్‌కు ఊరట వస్తే మొత్తానికి క్లీన్‌చిట్ వచ్చినట్లు BRS ప్రచారం చేస్తోంది. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే IAS అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశాం’ అని రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.


