News December 11, 2025

ఐవీఆర్ఎస్‌లో జిల్లా ర్యాంకు మెరుగుపరుస్తాం: VZM JC

image

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలో విజయనగరం జిల్లాకి మరింత మంచి ర్యాంకు సాధించేలా చర్యలు తీసుకుంటామని JC సేధు మాధవన్ తెలిపారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిస్థితిని వివిధ అంశాలపై జేసీ వివరించారు. రేషన్ సరకుల పంపిణీ నిర్ణీత సమయానికి పకడ్బందీగా జరుగుతోందని, ధాన్యం సేకరణ కూడా సజావుగా కొనసాగుతుందని చెప్పారు.

Similar News

News January 3, 2026

VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

image

AP KGBV ఔట్‌సోర్సింగ్‌లో 1095 పోస్టులకు <>నోటిఫికేషన్‌<<>> విడుదల చేసింది. ఇందులో విజయనగరం (D)కు టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-10, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-12, ANM-7, అటెండెర్-3, హెడ్ కుక్-1, ASST కుక్-2, వాచ్ ఉమెన్-1 ఉండగా.. టైప్-4లో వార్డెన్-4, పార్ట్ టైమ్ టీచర్-7, చౌకిదార్-5, హెడ్ కుక్-3 ASST కుక్-8 ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే అర్హులు. ఈనెల 11లోపు APC ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.

News January 3, 2026

బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు కఠిన కారాగార శిక్షను విధించినట్లు SP దామోదర్ శుక్రవారం తెలిపారు. బాడంగి (M)కి చెందిన V.వెంకటరమణ అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో 2024 డిసెంబర్‌లో పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

News January 3, 2026

గరుడుబిల్లిలో పాఠశాలలను తనిఖీ చేసిన : DEO

image

బొండపల్లి మండలం గరుడబిల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోవ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణ, విద్యార్థి ప్రతిభ పరిశీలన చేసి ప్రతి విద్యార్థి సైనింగ్ స్టార్‌గా మార్చేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.