News April 20, 2024

మంత్రి పెద్దిరెడ్డికి కారు కూడా లేదు..!

image

మంత్రి పెద్దిరెడ్డి అఫిడవిట్‌లోని వివరాల మేరకు చరాస్తులు రూ.10.59 కోట్లు, స్థిరాస్తులు రూ.114.25 కోట్లు ఉన్నాయి. భార్య పేరిట చరాస్తి రూ.14.55 కోట్లు, స్థిరాస్తి రూ.66.79 కోట్లు ఉంది. గత ఎన్నికలప్పుడు పెద్దిరెడ్డి ఆస్తి 91.74 కోట్లు ఉండగా.. ప్రస్తుతం 124.84 కోట్లకు పెరిగింది. ఆయన భార్య ఆస్తి రూ.39.22 కోట్ల నుంచి రూ.110.55 కోట్లకు పెరిగింది. పెద్దిరెడ్డిపై ఒక్క కేసు కూడా లేకపోగా ..కారు కూడా లేదు.

Similar News

News March 18, 2026

చిత్తూరు: 21న స్థాయి సంఘాల సమావేశం

image

జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాన్ని ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. ఉదయం 10గంటలకు జడ్పీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. 1 నుంచి 7 స్థాయీ సంఘాలతో ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వ్యవసాయం తదితర అంశాలపై సమావేశం ఉంటుందని వివరించారు.

News March 17, 2026

చిత్తూరు జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు

image

ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ వినియోగం, డ్రంకెన్ డ్రైవ్, లైసెన్స్‌లు, సర్టిఫికెట్లు తదితరు వాటిని పరిశీలించారు. ప్రజా భద్రత ధ్యేయంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

News March 17, 2026

చిత్తూరు: జగన్‌ను కలిసిన కరుణాకర్ రెడ్డి

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో వైసీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ శ్రేణులు పలుచోట్ల నిరసన తెలిపారు. ఆయనపై భూమన కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.