News December 12, 2025
ఇబ్రహీంపట్నం: ఉత్కంఠకు తెర.. సర్పంచ్‌గా గోపి గెలుపు

ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్ ఫలితంపై కొనసాగిన తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఇబ్రహీంపట్నం గ్రామ సర్పంచ్‌గా బద్దం గోపి విజయం సాధించారు. గోపి తన సమీప అభ్యర్థి పిట్టల వంశీపై 474ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Similar News
News December 18, 2025
టంగుటూరు మర్డర్.. మృతుని వివరాలివే.!

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడు మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన వెంకటరమణయ్యగా పోలీసులు గుర్తించారు. రమణయ్య టంగుటూరు ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య చనిపోగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.
News December 18, 2025
నిజామాబాద్: మూడో స్థానంలో స్వతంత్రులు

నిజామాబాద్ జిల్లాలో జరిగిన లోకల్ దంగల్‌లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. జిల్లాలో మూడు విడతల్లో 545 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవాలతో కలుపుకొని 362 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొంది మొదటి స్థానంలో నిలవగా, 76 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. 60 మంది స్వతంత్రులు గెలిచి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 47 గ్రామాల్లో బీజేపీ చివరగా ఉంది.
News December 18, 2025
టాప్‌లో చిత్తూరు జిల్లా

ఆధార్ అప్‌డేట్‌లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆధార్ నిబంధనల మేరకు 5-7 ఏళ్ల, 15-17 ఏళ్ల మధ్యలో వయసున్న పిల్లల ఆధార్ అప్‌డేట్ చేయాలి. చిత్తూరు జిల్లాలో 48,948 మంది పిల్లలు ఈ వయసు వారు ఉండగా డిసెంబర్ 13వ తేదీ నాటికి 30,929 మంది అప్‌డేట్ చేసుకున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తంగా 63%తో చిత్తూరు జిల్లా ఆధార్ అప్‌డేట్‌లో మొదటి స్థానంలో ఉంది.


