News December 12, 2025
SKLM: ‘వీఈఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి’

విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఇఆర్)లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ మందిరంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏఏ ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 13, 2025
సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News December 13, 2025
కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.
News December 13, 2025
పొందూరు బ్రాండ్.. అద్భుత ట్రెండ్!

మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత ప్రముఖుల మనసుదోచుకున్న వస్త్రం పొందూరు ఖాదీ. ఎండతాపం నుంచి ఉపశమనం, చల్లదనాన్ని ఇవ్వడం ఈ వస్త్రం ప్రత్యేకత. ఇంతటి ఖ్యాతి గడించిన ఖద్ధరకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ నిన్న అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ కీర్తి వచ్చేలా కేంద్రమంత్రి రామ్మోనాయుడు కృషి చేయడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


