News April 20, 2024
నేడు మెదక్ జిల్లాకి సీఎం రేవంత్

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు. కాగా ఈరోజు ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్నారు. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.
Similar News
News March 5, 2026
మెదక్: చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని సూసైడ్

మనోహరాబాద్ :చిట్టీ డబ్బుల విషయంలో మనస్థాపానికి గురై శివంపేట్ మండలం గంగాయిపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరబాద్ మండలం పోతారంలో ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షల చిట్టీ వేయగా, గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన కుటుంబీకులు, గ్రామస్థులు ఆ వ్యక్తి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు
News March 5, 2026
MDK: 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్

మెదక్ ఐడిఓసిలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల అమలు, సమన్వయం, ప్రజలకు సేవలు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
News March 5, 2026
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.


