News December 12, 2025
15న పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం: VZM కలెక్టర్

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం ఈనెల 15న విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆదేశించారు.
Similar News
News January 13, 2026
15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
News January 12, 2026
VZM: ‘పీజీఆర్ఎస్‌ని ప్రజలు వినియోగించుకోవాలి’

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 11, 2026
VZM: ఆకాశమే హద్దు.. పతంగులతో పిల్లల ఆటలు

సంక్రాంతి పండగను పురస్కరించుకొని పిల్లల్లో పతంగులు ఎగరవేయాలనే ఉత్సాహం పెరిగింది. రంగురంగుల పతంగులు, మాంజా దారాల కొనుగోలులో పిల్లలు బిజీగా ఉన్నారు. మైదానాలు, ఇంటి టెర్రస్‌లు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి. గాజు మాంజా వాడకూడదని విజయనగరం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. విద్యుత్ తీగల దగ్గర పతంగులు ఎగరవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.


