News April 20, 2024

ఉషశ్రీ చరణ్ ఆస్తుల వివరాలు

image

ఉషశ్రీ చరణ్‌కు రూ.4.16 కోట్ల చరాస్తులు, రూ.1.54 కోట్ల స్థిరాస్తులున్నాయి. 5.27 కేజీల బంగారం, 78 కిలోల వెండి ఉంది. 2 క్రిమినల్ కేసులున్నాయి. భర్త శ్రీచరణ్ స్థిర,చరాస్తులు రూ.44.93, 1.607 కేజీల బంగారం, 48 కిలోల వెండి, ఓ బస్సు, ఇతర వాహనాలు ఉన్నాయి. 2019 అఫిడవిట్ ప్రకారం ఉష స్థిర,చరాస్తులు రూ.1.52కోట్లు, 4.150 కేజీల బంగారం ఉంది. ఆమె భర్త స్థిర, చరాస్తులు రూ.7.61కోట్లు. 1.5కేజీల బంగారం ఉంది.

Similar News

News March 15, 2026

ATP: ఈనెల 16న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

image

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ విజన్ యూనిట్లలో విజయవాడలో నిర్వహించే 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

News March 15, 2026

1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రజలు అర్జీలు నమోదు చేసుకొని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలలో మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News March 15, 2026

అనంతపురం జిల్లాలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

image

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.260, స్కిన్ లెస్ రూ.280, అనంతపురంలో రూ.260, స్కిన్ లెస్ రూ.280 గుంతకల్లులో రూ.240, స్కిన్ లెస్ రూ.260కు విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీపై రూ.20 పెరిగినట్లు పేర్కొన్నారు.