News April 20, 2024
IPL: ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్

IPL చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్ పడింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. నిర్ణీత సమయానికి బౌలింగ్ వేయకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లకు BCCI రూ.12లక్షల చొప్పున ఫైన్ విధించింది. LSG కెప్టెన్‌గా KL.రాహుల్, CSK కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో CSKపై 8 వికెట్ల తేడాతో LSG గెలిచింది.
Similar News
News March 4, 2026
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ!

అమెరికా-ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేస్తున్నా ఇరాన్ తగ్గట్లేదు. ఈ క్రమంలో ఖతర్‌లోని యూఎస్ స్పేస్ ఫోర్స్‌కు చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్‌ను ఇరాన్ డ్రోన్లతో నాశనం చేసింది. మొత్తంగా $1.1 బిలియన్లు నష్టం సంభవించినట్లు నిపుణుల అంచనా. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో మిస్సైల్స్ దాడులను గుర్తించే వ్యవస్థ దెబ్బతినిందని, US దళాలు కొంతకాలం బ్లైండ్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
News March 4, 2026
ఇరాన్‌పై 3 డేంజరస్ బాంబర్లతో US దాడి

ఇరాన్‌పై అమెరికా 3 భారీ బాంబర్లను ఉపయోగించింది. అవి B-52 స్ట్రాటోఫోర్ట్రెస్, B-1 లాన్సర్, B-2 స్పిరిట్. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 31వేల KGల బరువైన బాంబులను మోసుకెళ్తుంది. B-1 లాన్సర్ సూపర్‌సోనిక్, ఫాస్టెస్ట్ బాంబర్. ఇది 35వేల కేజీల బాంబులను శత్రు స్థావరాలపై వేస్తుంది. ఇక B-2 స్పిరిట్ మోస్ట్ డేంజరస్. రాడార్లకు చిక్కకుండా 50వేల అడుగుల ఎత్తుపై నుంచి బాంబులను వదులుతుంది. దీని ధర దాదాపు ₹20వేల కోట్లు.
News March 4, 2026
ఇరాన్ పోరాటం వెనుక చైనా బలం!

US-ఇజ్రాయెల్‌కు ఇరాన్ దీటుగా బదులిస్తోంది. వాటిని టార్గెట్ చేస్తూనే UAE, ఒమన్, సౌదీ సహా 11 దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ పోరాటానికి రహస్యంగా చైనా సాయపడిందని అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్లు, క్షిపణులు, ఇతర అత్యాధునిక వెపన్స్‌తోపాటు కీలక సాంకేతికతను సరఫరా చేసిందని చెబుతున్నాయి. చైనా అండ లేకపోతే ఇరాన్ నిలబడేది కాదంటున్నాయి. శత్రువులపై కచ్చితత్వంతో చేస్తున్న దాడులను ఉదహరిస్తున్నాయి.


