News December 12, 2025

TU: ఈ నెల 22లోపు LLB, LLM పరీక్షా ఫీజు చెల్లించాలి: COE

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని చదువుతున్న LLB 1, 3, 5 సెమిస్టర్ల, LLM 1, 3 సెమిస్టర్ల రెగ్యులర్ (థియరీ&ప్రాక్టికల్) పరీక్షల ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ లోపు విద్యార్థులు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.

Similar News

News March 6, 2026

పెద్దపల్లి: ‘రెవెన్యూ ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలి’

image

రెవెన్యూ శాఖలో పెండింగ్ ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మార్చి 6 నుంచి వచ్చే దరఖాస్తులను 15 రోజుల్లో డిస్పోస్ చేయాలన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిజిటల్ జనగణన, ఏప్రిల్-మేలో హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని, ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం తెలంగాణ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలతో కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.

News March 6, 2026

BREAKING: ఫైనల్లోకి భారత్

image

T20WCలో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. బెథెల్ సెంచరీతో (48 బంతుల్లో 105) బెంబేలెత్తించినా చివర్లో వికెట్లు పడటంతో భారత్ విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.

News March 6, 2026

బుమ్రా@500 వికెట్లు

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు తీశారు. ఇవాళ సెమీఫైనల్లో ENG కెప్టెన్ బ్రూక్‌ను ఔట్ చేసి ఈ క్లబ్బులో చేరారు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా 235 మ్యాచులు ఆడారు. 18 సార్లు 5 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆ లెజెండరీ బౌలర్ 401 మ్యాచుల్లో 953 వికెట్లు పడగొట్టారు.