News December 12, 2025
టాటూలతో స్కిన్ క్యాన్సర్ ముప్పు

ఫ్యాషన్ కోసం చాలామంది టాటూస్ వేయించుకుంటుంటారు. అయితే దీనివల్ల స్కిన్ క్యాన్సర్ ముప్పు 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. లండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో టాటూ వేయించుకున్నవారికి తీవ్రమైన మెలనోమా క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి టాటూ వేయించుకున్న ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Similar News
News April 17, 2026
రాణించిన గ్రీన్.. KKR స్కోర్ 180

IPLలో రూ.25.2 కోట్ల ఆటగాడు <<19653410>>కామెరూన్ గ్రీన్(KKR)<<>> ఎట్టకేలకు తన స్థాయికి తగ్గట్లు ఆడారు. GTతో మ్యాచులో 32కే 3 వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగుకు వచ్చి 55 బంతుల్లో 79 పరుగులు(4 సిక్సులు, 7 ఫోర్లు) చేశారు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 180 స్కోరుకు ఆలౌటైంది. టిమ్ 19, రహానే 0, రఘువంశీ 8, పావెల్ 27, అనుకుల్ 9, రింకూ 1, రమణ్‌దీప్ 17 రన్స్ చేశారు. రబాడ 3, అశోక్ 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు.
News April 17, 2026
మహిళలకు వారి హక్కులు దక్కనివ్వలేదు: అమిత్ షా

రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు మహిళల హక్కు అయిన 33% కోటా వారికి దక్కనివ్వకుండా చేశాయని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల మనస్తత్వం మహిళలకుగానీ, దేశానికిగానీ అనుకూలంగా ఉండదని మండిపడ్డారు. నారీశక్తికి జరిగిన ఈ అవమానానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇకపై ప్రతిఎన్నికల్లో ప్రతిపక్షాలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని Xలో పోస్ట్ చేశారు.
News April 17, 2026
వీగిపోయిన బిల్లు.. కేంద్రం నెక్స్ట్ స్టెప్ ఏంటి?

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో కేంద్రం నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో NDA ఎంపీలు భేటీ అయి మంతనాలు జరుపుతున్నారు. రేపు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. విపక్షాలు మహిళా రిజర్వేషన్లకు అడ్డు తగిలాయనే అజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


