News December 12, 2025
మహబూబాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 155 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.99 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
Similar News
News April 6, 2026
పుష్కర ఘాట్‌లో స్నానాలకు ఏర్పాట్లు చేయాలి: శైలజా రామయ్యర్

మే మొదటి వారంలోగా నది ఘాట్ వద్ద క్లాడింగ్, రైలింగ్ పనులు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత కోసం బారికేడ్లు, హెలిప్యాడ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నదిలో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు.
News April 6, 2026
లేబర్ వెల్ఫేర్ పథకాల ప్రచారానికి కమిటీలు

AP: నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ-టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు టెండర్ ఈవాల్యుయేషన్, అప్రూవల్ కమిటీలను నియమిస్తూ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ-శ్రామ్ నమోదు, బాండెడ్ లేబర్ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది.