News December 12, 2025
డెలివరీ కోసమే అయితే వీసాలివ్వం: US ఎంబసీ

తమ దేశ పౌరసత్వం కల్పించడంపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. USలో బిడ్డకు జన్మనివ్వడానికి టూరిస్ట్ వీసాకు అప్లై చేస్తే నిరాకరించనున్నట్లు INDలోని US ఎంబసీ తెలిపింది. USలో జన్మిస్తే సహజ సిద్ధంగా పౌరసత్వం వస్తుందని కొందరు ప్రయత్నిస్తారని, ఆ అడ్డదారులను మూసేస్తున్నట్లు తెలిపింది. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిసినా అలాంటి వీసా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు చెప్పింది.
Similar News
News January 13, 2026
TCSలో మరిన్ని ఉద్యోగాల కోత!

TCSలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. 6 నెలల్లో 30 వేల మందిని ఇంటికి పంపిన కంపెనీ అవసరమైతే మరింత మందిని తీసేస్తామని చెప్పింది. ‘నంబర్ ఇంత అని నిర్ణయించలేదు. కానీ వచ్చే త్రైమాసికంలోనూ తొలగింపులు ఉంటాయి. సరైన కారణం, అంతర్గత ఆడిట్ ద్వారానే ఇవి జరుగుతాయి’ అని తెలిపింది. ప్రస్తుతం TCSలో 5,82,163 మంది పని చేస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్‌లో 19,755 మంది, డిసెంబర్ క్వార్టర్‌లో 11,151 మందిని తీసేసింది.
News January 13, 2026
‘రాజాసాబ్’.. హిందీలో 3 రోజుల్లో రూ.15.75 కోట్లే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’కు హిందీలో దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి 3 రోజుల్లో రూ.15.75 కోట్లు (గ్రాస్) మాత్రమే వసూలు చేసింది. అటు ధురంధర్ మూవీ 38వ రోజు హిందీలో రూ.6.5 కోట్లకు పైగా (నెట్) వసూలు చేయడం విశేషం. కాగా ప్రభాస్ నటించిన బాహుబలి-2, కల్కి సినిమాలు హిందీలో ఫస్ట్ వీకెండ్ రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి.
News January 13, 2026
ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా

TG: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా మంది కరెంట్ బిల్లులు చెల్లించట్లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘పాతబస్తీలో ప్రతిరోజు 20 లక్షల యూనిట్ల ఎలక్ట్రిసిటీని దొంగిలిస్తున్నారు. అంటే దాని విలువ ఏడాదికి రూ.500 కోట్లు. ఇది 2023 డేటా. ఇప్పుడు ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చు’ అని పాత వార్తలను షేర్ చేశారు.


