News December 12, 2025

విశాఖలో ఐటీ పెట్టుబడులతో కొలువుల జాతర(2/2)

image

టెక్ తమ్మిన రూ.62 కోట్లు (500 ఉద్యోగాలు), నాన్‌రెల్ టెక్నాలజీస్ రూ.50.6 కోట్లు (567 ఉద్యోగాలు), ఏసీఎన్ ఇన్ఫోటెక్ రూ.30 కోట్లు (600 ఉద్యోగాలు), ఇమాజిన్నోవేట్ రూ.140 కోట్లు (2,600 ఉద్యోగాలు), ఫ్లూయెంట్ గ్రిడ్ రూ.150 కోట్లు (2,000 ఉద్యోగాలు), మదర్సన్ టెక్నాలజీ రూ.109.73 కోట్లు (1,775 ఉద్యోగాలు), క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ రూ.115 కోట్లు (2,000 ఉద్యోగాలు) పెట్టుబడులు పెట్టనున్నాయి.

Similar News

News January 3, 2026

కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.

News January 3, 2026

HYD: ఆ ముగ్గురిపై మరో అధికారి ఉండరు: కర్ణన్

image

మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటికి కొత్తగా ముగ్గురు కమిషనర్లు నియమితులవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ఆ ముగ్గురు అధికారులపై మరో ఉన్నతాధికారి ఉండబోరని స్పష్టం చేశారు. ఈ అధికారులు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గ్రేటర్ ఎన్నికలు పాలక మండలి ముగిసిన తరువాతే ఉంటాయని అసెంబ్లీ లాబీలో పేర్కొన్నారు.

News January 3, 2026

చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

image

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.