News December 12, 2025

విశాఖలో ఐటీ పెట్టుబడులతో కొలువుల జాతర(1/2)

image

విశాఖ కాపులప్పాడ ఐటీ హిల్స్‌లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ఇవాళ చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,583 కోట్ల పెట్టుబడిని సంస్థ పెట్టనుండగా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇటు మధురవాడ హిల్-4లో నిర్మించనున్న సత్వా వాంటేజ్ క్యాంపస్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 40-50 వేల మందికి ఉపాధి లభించనుంది.

Similar News

News January 12, 2026

ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

image

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

News January 12, 2026

విశాఖ: కొడుకుతో బైక్‌పై వెళుతున్న తల్లి.. ప్రమాదంలో మృతి

image

నగరంలోని బర్మా క్యాంపునకు చెందిన రమణి తన కొడుకుతో బైక్‌పై రమా టాకీస్ వైపు వెళుతుండగా బైక్ హ్యండిల్‌కు బస్సు తగలడంతో అదుపు తప్పి కిందపడ్డారు. అనంతరం RTC బస్సు వెనుక చక్రం ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో తల్లి మృతి చెందడంతో కుమారుడు నిశ్చేష్ఠుడయ్యాడు. తల్లి మృతదేహం వద్ద ఏడ్చిన తీరు కంటతడి పెట్టింది. ద్వారక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News January 12, 2026

మేడారం జాతర బ్రోచర్‌ను ఆవిష్కరించిన సీఎం

image

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, గిరిజన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈనెల 18న మేడారానికి వస్తున్న సీఎం, 19న పూర్తయిన అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తారు.