News April 20, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

image

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా.. 27,788 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

Similar News

News March 6, 2026

మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం: CM

image

TG: మూసీ నదిలో చెత్త, మురికి పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరని CM రేవంత్ చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వ్యాపారాలను విస్తరిస్తామని తెలిపారు. రంగారెడ్డి(D) కొత్వాల్‌గూడలో ఎకో పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి జరగాలంటే కొందరు భూమి కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ అన్యాయం చేయం. అందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.

News March 6, 2026

ఎల్లుండే ఫైనల్.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

image

అహ్మదాబాద్ వేదికగా IND-NZ మధ్య ఎల్లుండి T20WC ఫైనల్ జరగనుంది. వర్షం లేదా ఏదైనా కారణాలతో ఆ రోజు మ్యాచ్ జరగకపోయినా, మధ్యలో ఆగిపోయినా మరుసటి రోజు రిజర్వ్ డే ఉంటుంది. ఆగిన దగ్గర నుంచే మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఫైనల్ ఫలితం తేలాలంటే ఇరు జట్లూ కనీసం 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. దురదృష్టవశాత్తూ 2 రోజులూ మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ఐసీసీ ప్రకటిస్తుంది.

News March 6, 2026

ముస్లిం దేశాల్లో పాక్ దగ్గరే న్యూక్లియర్ వెపన్.. ఎలా?(1/2)

image

ఇండియా 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేయడంతో పాక్ వణికిపోయింది. ‘గడ్డి తినైనా సరే అణుబాంబు సాధిస్తాం’ అని అప్పటి PM భుట్టో శపథం చేశారు. సైంటిస్ట్ AQ ఖాన్ నెదర్లాండ్స్ నుంచి డిజైన్లు దొంగిలించి గ్లోబల్ బ్లాక్ మార్కెట్ సాయంతో ప్రాజెక్ట్-706 స్టార్ట్ చేశారు. పాక్ చేస్తున్నది తప్పని తెలిసినా రష్యాతో పోరాడేందుకు సాయపడుతుందని US సైలెంట్‌గా ఉండిపోయింది. చైనా సాయపడటంతో 1980ల నాటికే పాక్ లక్ష్యం చేరుకుంది.