News December 12, 2025

ఈ సీజన్‌లోనే అత్యల్పం.. జి.మాడుగుల@3.2డిగ్రీలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అతి శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న APలోని అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ సీజన్‌లో ఇదే రికార్డు. డుంబ్రిగూడలో 3.6, అరకులో 3.9, ముంచంగిపుట్టులో 4.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. TGలోని ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 5.4, కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Similar News

News March 4, 2026

₹17 లక్షల డ్రోన్ కోసం ₹33 కోట్ల మిస్సైల్: ఇరాన్ ‘కాస్ట్ వార్’ వ్యూహం!

image

సుమారు ₹17 లక్షల విలువైన ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చడానికి అమెరికా ₹33 కోట్ల విలువైన పేట్రియాట్ మిస్సైళ్లను వాడుతున్నట్లు సమాచారం. ఈ వ్యూహంతో అమెరికా రక్షణ నిల్వలను దెబ్బతీయాలని ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ వంటి దేశాల వద్ద మిస్సైల్ నిల్వలు కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఆయుధాలు ఎవరి దగ్గర ముందుగా అయిపోతాయన్నదే ఈ యుద్ధ గమనాన్ని నిర్ణయించనుంది.

News March 4, 2026

చిరంజీవి కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

image

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో మరో మూవీని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో చిరు స్టైలిష్‌గా కనిపిస్తారని, భారీ క్లైమాక్స్ సెటప్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తుందని తెలిపాయి. ఇందులో పెద్ద స్టార్లు నటించబోతున్నారని, త్వరలో పూజా కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నాయి.

News March 4, 2026

బస్సుల్లో తగ్గిన పురుష ప్రయాణికుల సంఖ్య

image

AP: ‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. FEBలో నిత్యం 26 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు RTC తెలిపింది. దీంతో ఆక్యుపెన్సీ 92% దాటింది. అదే సమయంలో పురుషులు బస్సుల్లో ట్రావెల్ చేయడానికి జంకుతున్నారు. వారి సంఖ్య 37శాతానికి పడిపోయింది. బస్సుల్లో సీట్లు దొరకకపోవడమే దీనికి ప్రధాన కారణం. తాము డబ్బులు చెల్లిస్తున్నా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.