News April 20, 2024
బొత్స సత్యనారాయణ ఆస్తుల వివరాలు ఇవే..

☞ అభ్యర్థి: బొత్స సత్యనారాయణ
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.3.78 కోట్లు
☞ బంగారం: 31 తులాలు
☞ స్థిరాస్తి: రూ.6.75 కోట్లు
☞ అప్పులు: రూ.4.24 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.4.75 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.46 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 325 తులాలు
➠ బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లండించారు.
Similar News
News April 21, 2025
రాజాం: జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

మండలంలోని ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తరి నాగరాజు రాజాంలోని ఆర్కే కాంప్లెక్స్‌లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్డులు ఇస్తున్నారని వెళ్లారు. జనసేన నాయకుడు పొగిరి సురేశ్ బాబు తనను ఇక్కడికెందుకు వచ్చావని కులం పేరుతో తిట్టి, అతని అనుచరులతో దాడి చేయించాడని రాజాం పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ రవి కుమార్ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 21, 2025
VZM: ఈ నెల 22న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల పర్యటన

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 22వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3-00 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకొని, 3.30 గంటలకు నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు చేరుకొని పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 4.00 నుంచి 5.30 గంటల వరకు ప్రాజెక్ట్ పనులు, పునరావాసం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
News April 20, 2025
గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.