News December 12, 2025
VZM: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్‌లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్‌కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్‌లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్‌కు కష్టమౌతోంది.
Similar News
News January 12, 2026
పోలీస్ పీజీఆర్ఎస్‌కు 72 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని డీఐజీ, కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 72 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు, ఇన్వెస్ట్‌మెంట్, భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 12, 2026
18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు: CM

TG: తాను రెండేళ్ల పాలనలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెలవు తీసుకోవాలని ముందురోజు అనుకుంటా. కానీ ఏదో ఒక పని ఉంటుంది. సీఎం పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ఇప్పుడు బాధ్యతలు మరింత పెరిగాయి. రోజుకు 18 గంటలు పని చేసినా సమయం సరిపోవడం లేదు. ఇది బరువుగా చూడట్లేదు. బాధ్యతగా చూస్తున్నా’ అని ఉద్యోగులతో సమావేశంలో పేర్కొన్నారు.
News January 12, 2026
సంగారెడ్డి: ‘తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’

సంక్రాంతి సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. కొన్ని పాఠశాలలు సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


