News December 12, 2025
కృష్ణా: ప్రియుడి మృతితో యువతి సూసైడ్

సూర్యారావుపేటకు చెందిన లోహిత (22) కంకిపాడులోని పిన్ని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారం క్రితం తను ప్రేమించిన అబ్బాయి చనిపోవడంతో, లోహిత తీవ్ర మానసిక వేదనకు గురైందని బంధువులు తెలిపారు. ఉదయం లేచేసరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 26, 2025
ప్రకాశం జిల్లాలో TDP మొదలెట్టింది.. జనసేన ఎప్పుడో..?

ప్రకాశం జిల్లాలో TDP జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే TDPకి బూత్, గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి. అయితే జనసేన అదే తరహా కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యత కార్యక్రమంలో ప్రకటించారు. కాగా జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ సారథ్యంలో బూత్, గ్రామ కమిటీల నియామకం ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.
News December 26, 2025
అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రికి CBN వినతి

AP: వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను CM CBN కోరారు. పంచసూత్రాల ప్రణాళిక అమలుతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 10.70% అభివృద్ధి సాధించామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, రూ.2,585 కోట్ల అంచనాతో డీపీఆర్‌ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి ఇప్పటికే సమర్పించినట్టు వినతిపత్రంలో పేర్కొన్నారు.
News December 26, 2025
రెడ్ కలర్ చూస్తే ఎద్దులు దాడి చేస్తాయా! నిజమేంటి?

రెడ్ కలర్ ఎద్దులకు నచ్చదని, దాడి చేస్తాయనేది అపోహ మాత్రమే. చాలా పశువుల్లాగే ఎద్దులకు కూడా రెడ్ కలర్‌ను గుర్తించే రెటీనా సెల్స్ ఉండవు. ఎద్దులు డైక్రోమాట్స్ (2కలర్ రిసెప్టర్లు) కావడంతో ఎల్లో, బ్లూ, గ్రీన్, వయొలెట్ రంగులను గుర్తించగలవు. వాటికి ఎరుపు రంగు గ్రేయిష్-బ్రౌన్ లేదా ఎల్లోయిష్-గ్రేలా కనిపిస్తుంది. వేగమైన కదలికల కారణంగా దాడికి దిగుతాయి. తెలుపు, నీలం రంగు క్లాత్స్ కదిలించినా దాడి చేస్తాయి.


