News December 12, 2025

పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

image

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.

Similar News

News January 14, 2026

బదోనే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్

image

సీనియర్లను కాదని వాషింగ్టన్ సుందర్ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు <<18835903>>ఆయుష్ బదోని<<>>ని సెలక్ట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వివరణ ఇచ్చారు. ఇండియా-A టీమ్‌లో బదోని పర్ఫార్మెన్స్ బాగుందని.. IPLలోనూ రాణించినట్లు గుర్తుచేశారు. రైట్-ఆర్మ్ ఆఫ్-బ్రేక్ బౌలర్ అయిన బదోని.. సుందర్ ఆల్‌రౌండర్ స్థానాన్ని సరిగ్గా భర్తీ చేయగలడని భావించినట్లు వివరించారు.

News January 14, 2026

దూడల్లో నట్టల బెడద – ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.

News January 14, 2026

పండుగల్లో ఇలా రెడీ..

image

పండుగల్లో మహిళలకు పని, పూజ, ఇంటి అలంకరణ ఇలా బోలెడుంటాయి. చివరికి అన్నీ పూర్తి చేసుకొనే సమయానికి రెడీ అయ్యే టైం ఉండదు. అందుకే పండుగరోజు వేసుకొనే దుస్తులు, గాజులు, పిన్నులు అన్నీ పక్కన పెట్టుకోండి. సులువుగా ఉండే హెయిర్ స్టైల్ వేసుకోండి. తక్కువ మేకప్‌కి ప్రాధాన్యమివ్వండి. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు నప్పుతుంది. అన్నీ సర్దుకున్నాకే చీరకట్టుకుంటే కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.