News December 12, 2025

KNR: తాటి గేగులు.. ఆరోగ్య సిరులు!

image

ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఆహారాల్లో ‘తాటి గేగులు’ ఒకటి. పల్లెటూర్లలో ఎక్కువగా దొరికే ఈ గేగులు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కేవలం రుచికోసమే కాకుండా, వీటిని తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాటి గేగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Similar News

News January 13, 2026

తక్కువ ఖర్చుతో పంటకు రక్ష, దిగుబడికి భరోసా

image

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్ర పురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 13, 2026

వేములవాడ: భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 12 నుంచి సోమవారం రాత్రి 10 గంటల వరకు మొత్తం 1,08,438 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. 10,294 మంది భక్తులు కోడె మొక్కులు చెల్లించినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

News January 13, 2026

DSC 2026: అనంతపురం జిల్లాలో పోస్టులు ఎన్నంటే?

image

రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 252 ఉపాధ్యాయ <<18842620>>పోస్టులను<<>> భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రాథమికంగా తేల్చింది. 792 ఖాళీలు ఉండగా, మిగిలిన పోస్టులను పదోన్నతులతో నింపనున్నారు. అధికారులు సిద్ధం చేసిన జాబితాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ, ఎస్జీటీ ఖాళీలు తక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రకటన వెలువడే అవకాశం ఉండగా, జూన్ కల్లా నియామక ప్రక్రియ ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.