News December 12, 2025

BREAKING: కడపలో దారుణ హత్య.!

image

కడప జిల్లాలో శుక్రవారం ఉదయాన్నే ఓ హత్య జరిగింది. ఈ ఘటన కడపలోని స్వరాజ్ నగర్ వద్ద జరిగింది. వల్లెపు వెంకటయ్య (27)ని సిమెంట్ రాయితో కొట్టి కిరాతకంగా చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 8, 2026

కడప జిల్లాలో విద్యుత్ బకాయిలు రూ.26.46 కోట్లు

image

కడప జిల్లాలో ప్రవేట్ విద్యుత్ సర్వీసుల నుంచి ఇప్పటి వరకు రూ.26.46 కోట్లు బకాయిలు ఉన్నాయి. డివిజన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
కడపలో రూ.8.99 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.10.61 కోట్లు, మైదుకూరులో రూ.7.10 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇక పులివెందుల డివిజన్ పరిధిలో మాత్రం కొన్ని ప్రవేట్ కంపెనీలు అడ్వాన్స్ చెల్లింపులు చేయడంతో ఇక్కడ రూ.24.85 లక్షలు మిగులు ఉన్నాయి.

News March 8, 2026

కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో జోరుగా చూచిరాత?

image

కడప జిల్లాలో 32 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో ఇన్విజిలేటర్లు చూచిరాత రాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు స్టడీ సెంటర్ల నిర్వాహకులు సంబంధిత అధికారులకు, ఇన్విజిలేటర్లకు, బందోబస్తు పోలీసులకు పెద్ద మొత్తంలో మామూళ్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకుంటామని DEO తెలిపారు.

News March 7, 2026

కడప: ‘10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి’

image

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్‌లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.