News December 12, 2025

నేడు మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

image

TG: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాతలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం సేకరించింది. క్వింటాకు రూ.2,400 చొప్పున అందజేయనుంది. కాగా కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టపోకూడదని తామే పంటను సేకరిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Similar News

News January 10, 2026

తమీమ్-బీసీబీ మధ్య మాటల యుద్ధం

image

T20 వరల్డ్ కప్ భారత్‌లో కాకుండా న్యూట్రల్ వేదికల్లో పెట్టాలంటూ <<18761652>>BCB<<>> కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అంశం బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘మనకు ఎక్కువ ఆదాయం ICC నుంచే వస్తోంది కాబట్టి భవిష్యత్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్ ఇక్బాల్ సూచించారు. దీనిపై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లాం తమీమ్‌ “ఇండియన్ ఏజెంట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

News January 10, 2026

స్లీపర్‌ బస్సులపై కేంద్రం కఠిన నిబంధనలు

image

దేశంలో స్లీపర్‌ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాల్లో 145 మంది మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఇకపై స్లీపర్‌ బస్సులను ఆటోమొబైల్‌ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులే నిర్మించాల్సి ఉంటుందన్నారు. బస్సుల్లో అన్ని రకాల భద్రతా పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News January 10, 2026

జనవరి 10: చరిత్రలో ఈరోజు

image

* 1894: కవి పింగళి లక్ష్మీకాంతం జననం. 1972లో జనవరి 10నే ఆయన కన్నుమూశారు. * 1920: నానాజాతి సమితిలో సభ్యత్వం పొందిన భారత్ * 1940: ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు కేజే ఏసుదాసు పుట్టినరోజు * 1974: బాలీవుడ్ నటుడు హ్రితిక్ రోషన్ జననం (ఫొటోలో)