News April 20, 2024

నెల్లూరు MP అభ్యర్థి ఆస్తి రూ.11.55 కోట్లేనంట..!

image

➤నియోజకవర్గం : నెల్లూరు పార్లమెంటు
➤అభ్యర్థి : కొప్పుల రాజు (కాంగ్రెస్ పార్టీ)
➤విద్యార్హత : ఎంఫిల్
➤వృత్తి : విశ్రాంత ఐఏఎస్ అధికారి
➤కుటుంబ ఆస్తి: 11.55 కోట్లు
➤అప్పులు: రూ.1.02 కోట్లు
నోట్ : ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఈ వివరాలు నమోదు అయ్యాయి.

Similar News

News March 11, 2026

నెల్లూరు జిల్లాకు 100 ఎలక్ట్రికల్ బస్సులు

image

నెల్లూరు జిల్లాకు 100 ఎలక్ట్రికల్ బస్సు సర్వీసులు రానున్నట్లు RTC రీజనల్ మేనేజర్ షేక్ షమీమ్ తెలిపారు. ఉదయగిరి ఆర్టీసీ డిపోలోని అన్ని విభాగాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. ఉదయగిరి డిపోలో ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటుకు గ్యారేజ్ ప్రాంతంలో స్థల పరిశీలన చేశారు. నెల్లూరు-2 డిపో నుంచి ఉదయగిరి మార్గంలో 17 ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు నడుపుతామన్నారు.

News March 11, 2026

నెల్లూరు: ఆ రూ.20 కోట్లు ఎప్పుడిస్తారో..?

image

నెల్లూరు జిల్లాలో 2019 నుంచి 2022 వరకు మార్కెటింగ్ శాఖకు పౌర సరఫరాల శాఖ రూ.20 కోట్లు బాకీ పడినట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు చేసినందుకు మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని సమాచారం. మార్కెటింగ్ శాఖ ఈ ఏడాది రూ.38 కోట్ల సెస్సు వసూలు చేయాల్సి ఉండగా రూ.27 కోట్లు రాబట్టింది. అలాగే పౌరసరఫరాల శాఖ రూ.5 కోట్లు ఇస్తామని చెప్పినా ఇవ్వలేదు.

News March 11, 2026

నెల్లూరు: నిద్ర మత్తు వదిలిస్తున్న పోలీసులు..!

image

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాలతో హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో ప్రయాణించే డ్రైవర్లను ఆపి, వారి నిద్రమత్తు వదిలించేలా ముఖం కడిగిస్తున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపరాదని అవగాహన కల్పిస్తున్నారు. సురక్షిత ప్రయాణం కోసం డయల్ 112ను సంప్రదించాలని పోలీసులు కోరారు.