News December 12, 2025
కడపలో హత్య.. వివాహేతర సంబంధమే కారణమా.?

కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. స్వరాజ్ నగర్ వద్ద వల్లెపు వెంకటయ్య (27)ని సిమెంట్ రాయితో కొట్టి కిరాతకంగా చంపారు. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ <<18541025>>హత్యకు వివాహేతర సంబంధమే<<>> కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Similar News
News April 15, 2026
పోరుమామిళ్ల: ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పోరుమామిళ్ల మండలానికి చెందిన విద్యార్థి ఇంటర్‌లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు రిఫర్ చేశారు. డాక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థి తాగిన పాయిజన్ అత్యంత ప్రమాదకరమని, పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు.
News April 15, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15.360
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,131
* 10 గ్రాముల వెండి ధర రూ.2,520.
News April 15, 2026
కడప జిల్లాలో సెకండ్ ఇంటర్ ఫలితాలు యజమాన్యాల వారీగా ఇలా.!

కడప జిల్లాలో సెకండ్ ఇంటర్ ఫలితాలు యజమాన్యాల వారీగా ఇలా ఉన్నాయి.
✎ 20 ప్రభుత్వ కాలేజీల్లో 2002 మందికి గాను.. 1131 (56%) మంది పాస్
✎ 5 ఎయిడెడ్‌ల్లో 290 మందిలో 73 (25%)
✎ 9 HSPLUSల్లో 145 మందిలో 75 (48%)
✎ 3 మోడల్ కాలేజీల నుంచి 200 మందిలో 132 (66%)
✎ 11 APSWRల్లో 581 మందిలో 497 (86%)
✎ 16 KGBVల నుంచి 477 మందిలో 379 (79%).
✎ 71 ప్రైవేట్ కాలేజీల నుంచి 10201 మందిలో 7588 (74%) మంది పాస్ అయ్యారు.


