News December 12, 2025

పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమం

image

TG: పుట్టగొడుగుల పెంపకంతో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందవచ్చు. అందుకే నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం.. పుట్టగొడుగుల పెంపకంపై తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, రెడ్‌హిల్స్, నాంపల్లిలో 13.12.2025న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు B.Manga HO 8977714411, Shujauddin 8688848714ను సంప్రదించగలరు.

Similar News

News December 13, 2025

‘ఓట్ చోరీ’పై రేపు కాంగ్రెస్ సభ

image

‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ రేపు భారీ సభ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు హాజరుకానున్నారు. ఓట్ చోరీపై ఇప్పటిదాకా 5.5 కోట్ల సంతకాలు సేకరించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సభ తర్వాత సంతకాలతో కూడిన మెమొరాండంను సమర్పించేందుకు రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు.

News December 13, 2025

నక్సలిజం పాము లాంటిది: అమిత్ షా

image

నక్సలిజం ఎవరికీ ప్రయోజనం కలిగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం చూపగలదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ‘నక్సలిజం విషపూరితమైన పాము లాంటిది. దాన్ని అంతం చేసిన తర్వాత అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని బస్తర్ ఒలింపిక్-2025 ముగింపు కార్యక్రమంలో పేర్కొన్నారు.

News December 13, 2025

AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

image

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.