News December 12, 2025
నాగారం: సర్పంచిగా నిలబడటం, గెలుపొందడం రికార్డే

నాగారం సర్పంచ్‌గా రామచంద్రారెడ్డి గెలిచి రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించారనే చెప్పవచ్చు. 95 ఏళ్ల వయసులో పోటీలో నిలబడటమే కాదు, గెలవడం కూడా ఈ రోజుల్లో రికార్డే. నేటి యువతతో కలిసి మెజారిటీతో గెలవడం వందేండ్లకు చేరువైన ఈ నవయువకుడికి ఓ మధురానుభూతి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి అయిన ఈ బాపు.. శేష జీవితాన్ని గ్రామాభివృద్ధి కోసం అంకితం ఇస్తానన్నారు.
Similar News
News December 13, 2025
విశాఖ: ‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే CMకి ప్రత్యేక అభిమానం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక YCP నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.
News December 13, 2025
KNR: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: సీపీ

శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలాం శనివారం సందర్శించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
News December 13, 2025
‘ఓట్ చోరీ’పై రేపు కాంగ్రెస్ సభ

‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ రేపు భారీ సభ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు హాజరుకానున్నారు. ఓట్ చోరీపై ఇప్పటిదాకా 5.5 కోట్ల సంతకాలు సేకరించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సభ తర్వాత సంతకాలతో కూడిన మెమొరాండంను సమర్పించేందుకు రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు.


