News December 12, 2025

హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి: CBN

image

AP: అత్యంత హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందుతుందని CM CBN ఆకాంక్షించారు. తూర్పునావికాదళ కేంద్రంగా, టూరిజమ్ హబ్‌గా ఉన్న విశాఖ ఇప్పుడు ఐటీ, ఏఐ, టెక్నాలజీ, నాలెడ్జ్ సిటీగా మారుతోందని అభివర్ణించారు. కాగ్నిజెంట్ సహా 8 సంస్థలకు భూమి పూజచేశామని, ఏడాదిలో 25వేల మందికి అవకాశాలు వచ్చి ఇక్కడినుంచి పనిచేయగలుగుతారని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని, మెట్రో కూడా వస్తుందని చెప్పారు.

Similar News

News January 13, 2026

మాటేస్తున్న మాంజా.. ఇలా చేయండి!

image

సంక్రాంతి సందర్భంగా చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న HYD మీర్‌పేట్‌లో ఓ వృద్ధురాలి(85) కాలిని, విధులకు వెళ్తున్న ఏఎస్సై నాగరాజు మెడను మాంజా కోసేసింది. దీంతో వాహనాలపై వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శరీరమంతా కవర్ అయ్యేలా దుస్తులు ధరించాలి. మెడకు కర్చిఫ్ కట్టుకోవాలి. కాళ్లకు సాక్సులు, షూ, చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం వల్ల మాంజాల నుంచి రక్షణ పొందవచ్చు.

News January 13, 2026

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వరి ధాన్యం కొనుగోలు

image

TG: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్రం రికార్డును సాధించింది. ఈ ఏడాది 70.82 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీంతో రాష్ట్ర చరిత్రలో 2020-2021లో సాధించిన 70.2లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించింది. వరి ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు కనీస మద్దతు ధర కింద రూ.16,606కోట్లు చెల్లించింది. సన్నరకం వరి ధాన్యానికి బోనస్‌గా రూ.1,425 కోట్లు సైతం చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతోంది.

News January 13, 2026

భోగి పర్వదినాన గోదా రంగనాథ కళ్యాణం

image

భోగి పర్వదినాన ఆండాళ్ అమ్మవారు-శ్రీ రంగనాథ స్వామి దివ్య కళ్యాణం నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఈ కళ్యాణం ద్వారా వివాహ అడ్డంకులు తొలగి, దాంపత్య అన్యోన్యత పెరిగి, కుటుంబంలో శాంతి, శుభమంగళాలు స్థిరపడతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ అరుదైన పుణ్యావకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేదమందిర్‌లోనే గోదా రంగనాథుల అనుగ్రహాన్ని పొందండి. ఇవాళే మీ పేరు, గోత్రంతో సంకల్పం <>బుక్ చేసుకోండి<<>>.