News December 12, 2025
సంగారెడ్డి: నేటి సాయంత్రం నుంచి ప్రచారాలపై నిషేధం: కలెక్టర్

రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు ప్రచారాలపై నిషేధాన్ని విధించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికలు జరుగనున్న ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కొహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలవుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
వనపర్తి: రెండో విడత ఎన్నికలకు భారీ భద్రత: ఎస్పీ

వనపర్తి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1,150 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఆదివారం 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు.
News December 13, 2025
యాదగిరిగుట్ట: డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఒక మాసంపాటు ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. ధనుర్మాస ఉత్సవ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 4.30 నుంచి ఉదయం 5 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపంపై ఉత్తర భాగాంలోని హాలులో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
News December 13, 2025
విశాఖ: ‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే CMకి ప్రత్యేక అభిమానం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక YCP నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.


