News April 20, 2024

భానుడు ఉగ్రరూపం.. పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య

image

ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో వడగాల్పుల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వడగాల్పుల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 15 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. తాజాగా నల్గొండ మండలం చందనపల్లిలో కొండయ్య (50) వడదెబ్బతో మృతి చెందారు.

Similar News

News March 12, 2026

NLG: మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

image

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండో విడతలో ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే నల్లగొండ రీజియన్ పరిధిలో బస్సుల పంపిణీకి మార్గదర్శకాలు రానున్నాయి. ఒక్కో జిల్లాకు 150 సంఘాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో బస్సులు కేటాయించారు.

News March 12, 2026

నల్గొండలో బరి తెగిస్తున్న వడ్డీ మాఫియా

image

నల్గొండ జిల్లాలో అనధికార వడ్డీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నూటికి పది రూపాయల వరకు అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యులను వేధిస్తున్నారు. అప్పు తీర్చలేదన్న నెపంతో దాడులకు తెగబడుతుండటంతో పేదలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఎల్లారెడ్డిగూడెంలో వడ్డీ డబ్బుల విషయంలో ఫైనాన్సర్లు జరిపిన దాడిలో ఒక వ్యక్తి మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News March 11, 2026

టెన్త్ ఎగ్జామ్స్.. 19,835 మంది విద్యార్థులు: నల్గొండ DEO

image

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. DEO బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,143 మంది బాలురు, 9,551 మంది బాలికలు ఉండగా, 137 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.