News December 12, 2025
కోటవురట్ల: జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల రాసే విద్యార్థుల కోసం 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ ఏడాది 20,760 మంది పదవ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 15, 2026
మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
News January 15, 2026
ఇకపై గ్రోక్‌లో బికినీ ఫొటోలు రావు!

AI చాట్‌బాట్ గ్రోక్ ద్వారా మహిళలు, పిల్లల ఫొటోలను అశ్లీలంగా మారుస్తున్నారన్న ఫిర్యాదులపై X స్పందించింది. ఇకపై వ్యక్తుల చిత్రాలను బికినీలు లేదా అసభ్య దుస్తుల్లోకి మార్చకుండా టెక్నికల్‌గా మార్పులు చేసింది. భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, కాలిఫోర్నియాలో విచారణ ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను తొలగించి, 3500 పోస్టులను బ్లాక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.
News January 15, 2026
నిర్మల్: మూడు మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఇలా

నిర్మల్‌లో 42 వార్డులకు ఎస్టీ-జనరల్ (1), ఎస్సీ-జనరల్ (2), మహిళ -(1), బీసీ జనరల్ (9), మహిళ(8), మహిళా రిజర్వ్ (9), అన్ రిజర్వ్ (9).. భైంసాలోని 26 వార్డులకు ఎస్టీ జనరల్ (1), ఎస్సీ జనరల్ (2), మహిళ (1), బీసీ-జనరల్(5), మహిళ (4), మహిళా రిజర్వ్(8), అన్ రిజర్వ్డ్ (5).. ఖానాపూర్‌లోని 12 వార్డులకు ఎస్టీ-జనరల్ (1), ఎస్సీ-జనరల్ (1), మహిళ (1), బీసీ జనరల్ (2), మహిళ (1), మహిళా రిజర్వ్డ్ (4), అన్ రిజర్వ్ (2).


