News April 20, 2024
జూబ్లీహిల్స్ ప్రమాదం.. SI సస్పెండ్

2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో SI సస్పెండ్ అయ్యారు. బోధన్ మాజీ MLA షకీల్ తనయుడు రాహిల్ కారు ఢీకొట్టగా ఓ చిన్నారి మృతి చెందింది. అయితే ఈ కేసు నుంచి రాహిల్‌ను తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో అప్పుడు జూబ్లీహిల్స్ SIగా ఉన్న చంద్రశేఖర్‌ను తాజాగా కమిషనర్ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు.
Similar News
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్‌లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.
News March 3, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


