News April 20, 2024
ప్రకాశం జిల్లాకు రానున్న షర్మిలా రెడ్డి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు ఈనెల 22న వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 22న ఉదయం 10 గంటలకు బూదాల అజిత్ రావు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అదేరోజు చీరాలలో కూడా పర్యటించనున్నట్లు వెల్లడించారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు.
Similar News
News September 10, 2025
తర్లుపాడు MPDOపై సస్పెన్షన్ వేటు

తర్లుపాడు MPDO చక్రపాణి ప్రసాద్‌పై పబ్లిక్ సర్వీసెస్ జిల్లా అధికారులు వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంటింజెంట్ వర్కర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చక్రపాణిపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. MPDOపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కమిటీ విచారణ, ప్రాథమిక సాక్ష్యంతో సస్పెండ్ చేశారు.
News September 10, 2025
ప్రకాశం: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్‌లో 3 ప్రధాన రైళ్లు ఆగనున్నాయి. గత నెలలో రైల్వే GMకు MP మాగుంట దొనకొండ, కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేస్తున్నట్లు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.
News September 10, 2025
ఒంగోలు: బడి ఈడు పిల్లలు బడికి వెళ్లేలా చూడాలి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా ప్రైవేటు లేదా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య అభ్యసించాలని అన్నారు. మంగళవారం ఒంగోలు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో ‘లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులపై మాట్లాడారు. జిల్లా అధికారులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు.