News December 12, 2025

NHIDCL 64 పోస్టులకు నోటిఫికేషన్

image

<>NHIDCL <<>>64 అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com

Similar News

News January 14, 2026

కేశాలకు కర్పూరం

image

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కర్పూరం నూనెను వాడాలంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు రాసి తర్వాత రోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టును తగ్గించడంలోనూ కర్పూరం ఉపయోగపడుతుంది.

News January 14, 2026

సంక్రాంతిని ఎవరెలా చేస్తారంటే?

image

సంక్రాంతిని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. కేరళలో మకరజ్యోతి దర్శనం, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో మాంగి, అస్సాంలో బిహుగా పిలుస్తారు. గుజరాత్‌లో సిదా పేరిట సోదరీమణులకు బహుమతులిస్తారు. UPలో కిచెరి, ఒడిశాలో మకర చౌలాగా ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కోడి, పొట్టేళ్ల పందేలతో కోలాహలంగా ఉంటుంది. పేరు ఏదైనా ప్రకృతిని పూజించడం, దానాలు చేయడం, బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కామన్.

News January 14, 2026

మొక్కల్లో మాంగనీస్ లోప లక్షణాలు – నివారణ

image

మాంగనీస్ లోపం చీనీ, నిమ్మ తోటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల ఆకుల మీద పసుపు రంగు లేక పాలిపోయిన మచ్చలు ఏర్పడి క్రమంగా అవి తెల్లగా మారతాయి. ఆకులు కిందకు ముడుచుకొని బోర్లించిన గిన్నెలా అవుతాయి. ఆకులు మీద ఈ లోప చిహ్నాలను సులభంగా గుర్తించవచ్చు. నివారణ కోసం మాంగనీస్ సల్ఫేట్ 0.1 శాతం ద్రావణాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి లోపాన్ని నివారించవచ్చు.