News December 12, 2025

ప్రచారానికి తెర.. కరీంనగర్ పల్లెలు సైలెంట్.!

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో పల్లెల్లో ఎన్నికల సందడికి తెరపడింది. పాటలు, కరపత్రాలతో ఓటర్లను ఆకర్షించిన అభ్యర్థులు మౌనం వహించారు. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అధికారులు ఓటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Similar News

News January 18, 2026

కరీంనగర్ జిల్లాలో వార్డుల రిజర్వేషన్లు పూర్తి

image

KNR జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ సహా జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పమేలా సత్పతి లాటరీ పద్ధతిన ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వార్డులను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News January 17, 2026

కరీంనగర్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు

image

KNR కార్పొరేషన్ 66 వార్డుల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్టీ జనరల్: 28
ఎస్సీ మహిళ: 27, 30, 53
ఎస్సీ జనరల్: 4, 20, 25, 29
బీసీ మహిళ: 1, 5, 17, 33, 35, 43, 45, 47, 48, 54, 62, 64
బీసీ జనరల్: 10, 14, 31, 32, 34, 36, 37, 39, 46, 58, 59, 61, 63
జనరల్ మహిళ: 3, 7, 9, 11, 12, 13, 15,19, 38, 40, 41, 44, 49, 52, 55, 56, 57, 60
జనరల్: 2, 6, 8, 16, 18, 21, 22, 23, 24, 26, 42, 50, 51, 65, 66

News January 17, 2026

కరీంనగర్: చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

image

స్థానిక బాల సదనంకు చెందిన తొమ్మిది, పన్నెండేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను హైదరాబాద్‌కు చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంతానం లేని వారు చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.