News December 12, 2025

మద్యం దుకాణాలను మూసివేయాలి: ఆదర్శ్ సురభి

image

వనపర్తి జిల్లాలో ఈనెల 14న 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో శుక్రవారం 5PM తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత మండలాలలో నిషేధాజ్ఞలు 5గంటల నుంచి అమలులోకి వస్తాయన్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News December 13, 2025

విశాఖ: ‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

image

విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే CMకి ప్రత్యేక అభిమానం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక YCP నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.

News December 13, 2025

KNR: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

శంకరపట్నం మండలంలోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) గౌస్‌ ఆలాం శనివారం సందర్శించారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున గుంపులుగా సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పోలీస్‌ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

News December 13, 2025

‘ఓట్ చోరీ’పై రేపు కాంగ్రెస్ సభ

image

‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ రేపు భారీ సభ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు హాజరుకానున్నారు. ఓట్ చోరీపై ఇప్పటిదాకా 5.5 కోట్ల సంతకాలు సేకరించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సభ తర్వాత సంతకాలతో కూడిన మెమొరాండంను సమర్పించేందుకు రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు.