News April 20, 2024
సీఎం జగన్ అనంత జిల్లాకు ఏం చేశారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం రాత్రి కనేకల్లులో ప్రజాగళం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డను అని చెప్పుకొనే జగన్.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. టీడీపీ హాయంలో రూ.4,500కోట్లతో హంద్రీనీవా ప్రారంభించామన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్సీ నీరు తెచ్చామన్నారు. బైరవానితిప్ప, ఉంతకల్లు ప్రాజెక్టులపై జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
Similar News
News March 26, 2026
400 మంది విద్యార్థుల గైర్హాజరు

అనంతపురం జిల్లాలో బుధవారం పదో తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 143 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 32,485 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 32,085 మంది హాజరయ్యారు. 400 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పర్యవేక్షణ కోసం 10 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. పరీక్షల నిర్వహణ క్రమబద్ధంగా జరిగిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
News March 26, 2026
అనంత: మీ ఊరిలో తాగునీటి సమస్యా? ఈ నంబర్‌కు కాల్ చెయ్!

అనంతపురం కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీపీవో నాగరాజు నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైతే ప్రజలు ఫోన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఫిర్యాదు చేసేందుకు 9550480972 సంప్రదించవచ్చన్నారు.
News March 26, 2026
అనంత: ఇవాళ రూ.లక్ష గెలుచుకునే ఛాన్స్!

పెద్దవడుగూరు మండలంలో రేపటి నుంచి రాష్ట్రస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు జరగనున్నాయి. వీరభద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మొత్తం 9 బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతి రూ.లక్ష ఇవ్వనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తెలిపారు.


