News December 12, 2025

నెల్లూరు: నేటి అర్ధరాత్రి నుంచి అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ క్లోజ్

image

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధానమైన అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మరమ్మతు పనుల దృష్ట్యా నేటి అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వచ్చే ఏడాది జనవరి నెల 10వ తేదీ వరకు మరమ్మతు పనులను చేపట్టి ఫ్లైఓవర్‌ను ఆధునికరించనున్నామని కమిషనర్ వివరించారు.

Similar News

News January 17, 2026

కోడి పందాలపై కఠినంగా.. బీచ్ భద్రతపై ఎందుకీ నిర్లక్ష్యం?

image

కోడి పందాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినా, సముద్ర తీర ప్రాంతాల భద్రతపై మాత్రం అదే స్థాయి పర్యవేక్షణ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 2న మైపాడు బీచ్‌లో ముగ్గురు యువకులు మృతి చెందగా, తాజాగా శుక్రవారం అల్లూరు బీచ్‌లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. లైఫ్‌గార్డులు, హెచ్చరిక బోర్డులు, పోలీస్ పర్యవేక్షణ లోపించడం ప్రమాదాలకు కారణమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 17, 2026

నెల్లూరు: మీ పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం

image

నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతు, సుడిగుండాలు తెలియకుండా నీటిలోకి దిగితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని, పిల్లలను నీటి దగ్గర ఒంటరిగా వదలరాదని తెలిపారు. ఒక్క నిమిషం అజాగ్రత్త కుటుంబానికి జీవితకాల దుఃఖాన్ని మిగుల్చుతుందని హెచ్చరిస్తున్నారు.

News January 17, 2026

ముక్కనుమ విశిష్టత మీకు తెలుసా..?

image

ముక్కనుమ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు గడిచిన నాలుగువ రోజున వస్తుంది. ఈ రోజున కొత్తగా పెండ్లి అయిన మహిళలు ‘సావిత్రి గౌరివత్రం’ అంటే ‘బొమ్మల నోము’ పడతారు. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. తెలిసినవారు కామెంట్ చేయండి.