News December 12, 2025

కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.

Similar News

News March 5, 2026

కృష్ణా: అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలు

image

మే 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఇళ్ల గణన కార్యక్రమంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కృష్ణా యూనివర్శిటీలో నిర్వహించిన మొదటి దశ ఇళ్ల జాబితా, జిల్లా స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల మాదిరిగా ఈ గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు.

News March 4, 2026

కృష్ణా: 16 నుంచి ‘పది’ పరీక్షలు.. హాల్ టికెట్లు విడుదల

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు బుధవారం విడుదలయ్యాయి. జిల్లా విద్యాశాఖాధికారి UV సుబ్బారావు తెలిపారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. హాల్ టికెట్లు కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంటాయని, అనధికారిక సైట్లను నమ్మవద్దని హెచ్చరించారు. bre.ap.gov.in, Mana Mitra WhatsApp Governance 95523 00009 ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

News March 4, 2026

చల్లపల్లి: చాకుతో బెదిరించి.. బంగారం దోపిడీ

image

చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ శివారు రామానగరంలో మంగళవారం దోపిడీ కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 78 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వంటగదిలోకి చొరబడ్డారు. చాకుతో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులు లాక్కొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ దుర్గాంజనేయులు తెలిపారు.